పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు: శేషన్నను నిర్ధోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు

Published : Mar 24, 2023, 02:00 PM ISTUpdated : Mar 24, 2023, 02:13 PM IST
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు: శేషన్నను నిర్ధోషిగా  తేల్చిన నాంపల్లి కోర్టు

సారాంశం

 పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య  కేసులో మాజీ మావోయిస్టు శేషన్నకు ఊరట లభించింది.  శేషన్నను  నిర్ధోషిగా  నాంపల్లి కోర్టు ప్రకటించింది.  

హైదరాబాద్: పటోళ్ల  గోవర్ధన్ రెడ్డి  హత్య  కేసులో  మాజీ మావోయిస్టు  శేషన్నను  శుక్రవారంనాడు నిర్ధోషిగా  ప్రకటించింది నాంపల్లి కోర్టు.   2011 డిసెంబర్  28న హైద్రాబాద్ లోని బొగ్గులకుంట వద్ద  పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని  నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు  హత్య  చేశారు. ఆటోలో  మరో వ్యక్తితో  కలిసి  వెళ్తున్న  పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని  దుండగులు  హత్య  చేశారు. 

2022 సెప్టెంబర్ 27న  హైద్రాబాద్ లో  సెటిల్ మెంట్  చేస్తున్న  సమయంలో  శేషన్నను  హైద్రాబాద్  పోలీసులు  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.  నయీం  ప్రధాన అనుచరుడిగా  ఉన్న  శేషన్న పై  పలు  కేసులు  నమోదైన విషయం తెలిసిందే. 

ఈ హత్య  కేసులో  మాజీ మావోయిస్టు  శేషన్నను ప్రధాన నిందితుడిగా ఆరోపణలు  ఎదుర్కొన్నారు.ఈ కేసులో   శేషన్నను  నాంపల్లి  కోర్టు  నిర్ధోషిగా  ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?