సాక్ష్యాలు సమర్పించని పోలీసులు: ఉగ్రవాది తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

By Siva KodatiFirst Published Mar 3, 2020, 10:05 PM IST
Highlights

లష్కరే తోయిబా ఉగ్రవాది, 1998లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ కరీమ్ తుండాను నాంపల్లి కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందనడానికి పోలీసులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం తుండాను నిర్దోషిగా ప్రకటించింది. 

లష్కరే తోయిబా ఉగ్రవాది, 1998లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ కరీమ్ తుండాను నాంపల్లి కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందనడానికి పోలీసులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం తుండాను నిర్దోషిగా ప్రకటించింది. 

హైద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తుండాపై కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌ జైల్లో తుండా  ఉన్నాడు. బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనగా  ప్రముఖ ఉగ్రవాది కరీం తుండా ప్రతీకార దాడులకు పూనుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. హైద్రాబాద్‌లో కూడ కరీం తుండా పలు బాంబు దాడులకు పాల్పడినట్టుగా పోలీసులు కేసులు  నమోదు చేశారు.

Also Read:ఉగ్రవాది కరీం తుండాపై బాంబు పేలుళ్ల కేసులు: నేడు నాంపల్లి కోర్టు తుది తీర్పు

తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ ఏర్పాటులో కరీం కీలకంగా వ్యవహరించారు. కరీం ప్రధాన అనుచరుడు కలీల్ అన్సారీని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో కూడ కొంతకాలం పాటు ఆయన తలదాచుకొన్నాడు. ఏడేళ్ల క్రితం తుండా నేపాల్‌లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంను విచారించిన సమయంలో దేశంలో పలు దాడులకు సంబంధించిన సమాచారం వెలుగు చూసింది.

1990లో యువకులను ఉగ్రవాదం వైపు తుండా మళ్లించేవాడని పోలీసులు చెబుతున్నారు.  1993లో వరుస బాంబు పేలుళ్లలో తుండా కీలకంగా వ్యవహరించాడని పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read:పుల్వామా దాడి: టెర్రరిస్టులకు సహకరించిన తండ్రీకూతుళ్ల అరెస్టు

తమిళనాడులోని కోయంబత్తూరులో 1998 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు 12 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. 12 కి.మీ. పరిధిలో జరిగిన ఈ హింసాకాండలో మొత్తం 58 మంది దుర్మరణం పాలయ్యారు. 

ఢిల్లీ వెళ్లే రైలులో కూడ తుండా బాంబులు పెట్టినట్టుగా ఆయనపై కేసులు ఉన్నాయి.  ఘజియాబాద్‌ జైల్లో ఉన్న తుండాను హైద్రాబాద్ పోలీసులు పిటీ వారంట్‌పై తీసుకొచ్చి విచారించారు.

click me!