TG Venkatesh : బంజారాహిల్స్ భూ ఆక్రమణ కేసులో బీజేపీ ఎంపీ టీజీ వెంక‌టేష్ పేరు..

Published : Apr 19, 2022, 08:52 AM IST
TG Venkatesh : బంజారాహిల్స్ భూ ఆక్రమణ కేసులో బీజేపీ ఎంపీ టీజీ వెంక‌టేష్ పేరు..

సారాంశం

భూ ఆక్రమణ ఆరోపణలపై ఏపీ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆయనను పోలీసులు ఏ5 గా చేర్చారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు కేటాయించిన రెండున్నర ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై కేసు న‌మోదైంది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం ఆయ‌న పేరు చేర్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 63 మందిని అరెస్టు చేశారు.  

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండెకరాల ఆస్తికి సంబంధించిన కేసు ఇది. కోట్లాది రూపాయల విలువైన ఈ ల్యాండ్ ను 2005లో అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు కేటాయించింది. ఈ ల్యాండ్ ఒక‌ప్పుడు మెహుల్ చోక్సీకి చెందిన‌ది. తరువాత దానిని NCLT కోర్టు ఆర్డర్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఏస్ అర్బన్ డెవలపర్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం క‌ర్నూలు నుంచి వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు ఈ ల్యాండ్ త‌మదేనంటూ అక్క‌డి వ‌చ్చి సెక్యూరిటీ గార్డును బెదిరించారు. దీంతో అక్క‌డికి బంజారాహిల్స్ పోలీసులు చేరుకున్నారు.  63 మందిపై నేరారోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారిలో ప‌లువురి వ‌ద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి.  

ఈ కేసులో నిందితుల్లో ఇప్పటి వరకు ఆరుగురు నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఇందులో టీజీ విశ్వ ప్రసాద్ (ఏ1), టీజీ వెంకటేష్ (ఏ5), పేర్ల‌ను పి.సుభాష్ (ఏ3)ల అనే వ్య‌క్తి తెలిపార‌ని చెప్పారు. వారిద్ద‌రు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, ఇత‌ర నిందితుల‌ను కూడా ఏర్పాటు చేశార‌ని ఆయ‌న పేర్కొన్నార‌ని అన్నారు. 

అయితే ఈ విష‌యంలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్ అమెరికా నుంచి ఓ వీడియో ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేశారు. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు స్థ‌లం ప‌క్క‌నే ఉన్న ఆస్తి అభివృద్ధికి త‌మ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని ఆయ‌న తెలిపారు. తాము ఆ ల్యాండ్ లో పార్శిల్ వాణిజ్య భ‌వ‌నాన్ని నిర్మించ‌డానికి ఒప్పందంపై సంత‌కం చేశామ‌ని చెప్పారు. అయితే ఈ ఘ‌ట‌న అపార్థం వ‌ల్ల జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇందులో ఎవ‌రి ప్ర‌మేయాలు, మరే ఇత‌ర ఉద్దేశాలు ఉన్నాయో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. గతంలో కూడా కొంద‌రు మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నించార‌ని, అందుకే ఈ భూమి త‌మ‌దేన‌ని రుజువు స‌మ‌ర్పించి కోర్టు నుంచి ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ పొందాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. 

ఆదివారం నాటి ఘ‌ట‌న గురించి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. త‌న లాయ‌ర్ సలహా మేరకు ఆ ల్యాండ్ ను సుర‌క్షితంగా ఉంచేందుకు, ఓ సినీ నిర్మాత సుభాష్‌కి ఆ ల్యాండ్ ను యాక్సెస్ చేయ‌డానికి అనుమ‌తి ఇచ్చార‌ని చెప్పారు. “ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మా ఊరి నుంచి దాదాపు 70 మంది వచ్చారు. మాకు అనుకూలంగా కోర్టు ఉత్త‌ర్వులు రావ‌డంతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. కానీ పోలీసులు కొన్ని కార‌ణాల వ‌ల్ల వారందరినీ అదుపులోకి తీసుకొని తప్పుడు కేసులు నమోదు చేశారు’’ అని ఆయ‌న పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!