మాజీ ఆర్మీ ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం: వేముల వీరేశంపై కేసు నమోదు

By narsimha lodeFirst Published May 6, 2021, 12:47 PM IST
Highlights

మాజీ సైనికుడు కోటేశ్ ఆత్మహాత్యాయత్నం కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

నల్గొండ:మాజీ సైనికుడు కోటేశ్ ఆత్మహాత్యాయత్నం కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్టంగూరు ఎంపీటీసీకి రూ. 10 లక్షలను కోటేశ్ అప్పుగా ఇచ్చాడని ఆయన భార్య చెబుతున్నారు. ఈ డబ్బులు చెల్లించాలని కోటేష్ ఎంపీటీసీని కోరాడు. అయితే  డబ్బులు చెల్లించకుండా తమను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చెబితేనే రూ. 10 లక్షలను తాము కట్టంగూరు ఎంపీటీసీకి ఇచ్చినట్టుగా బాధిత కుటుంబం చెబుతుంది. 

అప్పు చెల్లించకుండా తన భార్యను మాజీ ఎమ్మెల్యే వీరేశం బెదిరించాడని కోటేష్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ బెదిరింపులకు భయపడి కోటేశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. కోటేష్ భార్య ఫిర్యాదు మేరకు  పోలీసులు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కేసు నమోదైంది. 

గతంలో కూడ  వేముల వీరేశంపై బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆడియో సంభాషణలు కూడ అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు. చిరుమర్తి లింగయ్య కూడ ప్రస్తుతం కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎష్ లో చేరారు. 
 

click me!