కొడుతూ చంపేస్తా, బాలిక హత్య కేసులో ఆడియో సంభాషణ లీక్: నల్గొండలో ముగ్గురు అరెస్ట్

Published : Jul 21, 2021, 11:01 AM IST
కొడుతూ చంపేస్తా, బాలిక హత్య కేసులో ఆడియో సంభాషణ లీక్:  నల్గొండలో ముగ్గురు అరెస్ట్

సారాంశం

నల్గొండ జిల్లాలోని కేతేపల్లిలో బాలిక అనుమానాస్పదస్థితిలో పవన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  బాలిక హత్యకు గురైందని చెప్పినా కూడ ఎస్ఐ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అతడిని వీఆర్ కు పంపారు.

నల్గొండ: ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించిన బాలిక ప్రీతిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆడియో సంభాషణను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.నల్గొండ జిల్లాలోని కేతేపల్లికి చెందిన బాలిక ప్రీతి ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. బాలికను హత్య చేశారని  చెప్పినా  కూడ స్థానిక ఎస్ఐ పట్టించుకోలేదు.ఈ విషయమై బాధిత కుటుంబంతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఎస్ఐను  వీఆర్‌కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు.

ఈ నెల 17వ తేదీన బాలిక డెడ్‌బాడీని వెలికి తీసి రీ పోస్టు మార్టం చేశారు.  రీ పోస్టుమార్టంలో కూడ బాలికది హత్యేనని తేలింది. బాలికను కొడుతూ చంపేస్తానని  నిందితుడు పవన్ తన ఫ్రెండ్స్ కు చెప్పాడు. ఈ ఆడియో సంభాషణ ఒకటి పోలీసులు గుర్తించారు.ఈ కేసు విచారణను  డీటీసీ ఎస్పీ సతీష్ కు అప్పగించారు డీఐజీ రంగనాథ్.  నిందితుడు పవన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu