తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: గుత్తా

Published : Jul 25, 2018, 11:59 AM IST
తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: గుత్తా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని  నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు  ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ఆయన కోరారు. 

నల్గొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని  నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు  ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ఆయన కోరారు. 

బుధవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. విభజనతో తెలంగాణ కూడ నష్టపోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ గురించి సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన తెలంగాణకు ప్రత్యేక హోదా ఇస్తే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని  సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో  ఏపీ రాష్ట్రానికి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే  తెలంగాణకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?