Nalgonda MLC Election 2021: కాంగ్రెస్ ఓట్లు కూడా టీఆర్ఎస్ కే: మంత్రి జగదీష్ రెడ్డి సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Dec 10, 2021, 05:28 PM IST
Nalgonda MLC Election 2021: కాంగ్రెస్ ఓట్లు కూడా టీఆర్ఎస్ కే: మంత్రి జగదీష్ రెడ్డి సంచలనం

సారాంశం

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటుహక్కును వినియోగించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

సూర్యాపేట: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా శాసనమండలి (telangana mlc elections 2021) స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ (TRS Party) విజయదుందుభి మ్రోగించబోతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (jagadish reddy) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆశిస్సులతో ఉమ్మడి నల్గొండ (nalgonda) జిల్లా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంసి కోటిరెడ్డి (mc kotireddy) విజయం నల్లేరు మీద నడకేనని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సూర్యపేట జిల్లాకేంద్రంలో (suryapet district) ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో మంత్రి జగదీష్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం మంత్రి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. రాజకీయాలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి బాసటగా నిలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా సత్తా చాటిందని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం అని మరోమారు నల్గొండ జిల్లా నిరూపించిందన్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలకు భిన్నంగా టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారన్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విజ్ఞులైన ఓటర్లు కాంగ్రెస్ (congress) కుట్రలను పటాపంచలు చేశారని ఆయన పేర్కొన్నారు. 

read more  Karimnagar MLC Election 2021: 986 కు ఒక్క ఓటు టీఆర్ఎస్ తగ్గినా... ఈటలకు మంత్రి గంగుల సవాల్ (వీడియో)

ఒడ్డు పొడుగుతో ఇంత లావు, అంత లావు అని చెప్పుకోవడంతో పాటు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నేతలు నేరుగా బి-ఫారం ఇవ్వకుండా దొడ్డిదారిలో అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారని మంత్రి ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించిన విపక్షాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం చివరి నిమిషంలో తమకే ఓటేసారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

బడానేతల కుయుక్తులతో కాంగ్రెస్ కు కంచుకోటగా అనుకున్నది కాస్తా మంచు కోటాల్లా కరిగిపోతుందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి తిరుగు లేదు... ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ వెంటే అనేందుకు ఈ ఎన్నికల ఫలితం దోహదపడుతుందన్నారు. 

రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధిని, జరుగుతున్న ప్రగతిని చూసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం అంటూ భావించి రాజకీయాలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

read more  Telangana MLC Elections 2021: కరీంనగర్ లో ఉత్కంఠ... భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ (వీడియో)

ఇదిలావుంటే ఖమ్మం జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (puvvada ajay kumar) కూడా టీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానికసంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ పార్టీదేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు (thatha madhu) భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్