అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయండి: కలెక్టర్‌తో ఎమ్మెల్యే రివ్యూ

By sivanagaprasad kodatiFirst Published Jan 10, 2019, 12:18 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్‌తో పాటు గ్రామీణ నీటి పారుదల, పబ్లిక్ హెల్త్ తదితర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులలో లోపాలను సరిదిద్దాలని, వేసవికి ముందే మంచినీటి సరఫరాను క్రమబద్దీకరించాలని కంచర్ల కలెక్టర్‌ను కోరారు. ఇంటింటికి మంచినీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ పథకాన్ని సకాలంలో అమలు చేయగలిగితే మంచినీటి ఎద్దడి గండం నుంచి బయట పడగలుగుతామని అధికారులకు చెప్పారు.

నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు లోపభూయిష్టంగా మారాయని, వాటిని సరిదిద్దేందుకు అధికారులు చొరవ చూపాలని భూపాల్‌రెడ్డి కోరారు. నల్గొండ పట్టణాన్ని సుందరీకరించేందుకు రూపొందించిన ప్రణాళికలు ప్రభుత్వం ఆమోదం కొరకు ఉన్నాయని.. ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.

ఇప్పటికే నల్గొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ 100 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. నల్గొండను రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

click me!