ఎవరు ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయ్యండి : మునుగోడు ప్రచారంలో ఉత్తమ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 09, 2022, 08:45 PM IST
ఎవరు ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయ్యండి : మునుగోడు ప్రచారంలో ఉత్తమ్ వ్యాఖ్యలు

సారాంశం

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు మందు బాటిల్ ఇచ్చినా .. ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోవాలని ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ఆయన పిలుపునిచ్చారు

ఎవరు మందు బాటిల్ ఇచ్చినా .. ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోవాలని ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ మాజీ చీఫ్ , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఆయన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్ధతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళా సంఘాలకు వడ్డీ రాయితీలను మర్చిపోయారని.. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ఏం చేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇంకో ఆరు నెలల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయినందుకే ఈ ఉపఎన్నికలు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాజీనామా చేస్తే మునుగోడుకు నిధులు వస్తాయని రాజగోపాల్ రెడ్డి అన్నారని.. కానీ అమ్ముడుపోయే వాళ్లకే నిధులు వస్తున్నాయంటూ ఆయన చురకలు వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇక్కడ ఓటుకు 30 వేలు, 40 వేలు ఇస్తామని బీజేపీ, టీఆర్ఎస్‌లు ఇస్తాయంటున్నాయని ఆయన ఆరోపించారు. ఆరుగురితో కలిసి కోట్లాడితే నిధులు వస్తాయా... ముగ్గురున్న బీజేపీలో చేరితో నిధులు వస్తాయా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను మోసం చేసినోడు రాజకీయంగా బతికి బట్టకలేడని ఆయన జోస్యం చెప్పారు. 

ALso Read:మునుగోడులో ఓటుకు ఒకరు రూ. 30 వేలు.. మరొకరు రూ. 40 వేలు అంటున్నారు: బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్

నిన్న మునుగోడు ఉప ఎన్నికపై ఏఐసీసీ కార్యదర్శుల సమీక్షలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీల దిగజారుడు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని విమర్శించారు. మునుగోడులో ప్రజాస్వామిక వాదులకు అపనమ్మకం కలిగే విధంగా టీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇది నిజంగా శోచనీయం అని అన్నారు. ఒకరు ఓటుకు రూ. 30 వేలు, మరొకరు ఓటుకు రూ. 40 వేలు అంటున్నారని ఆరోపించారు. 

టీఆర్ఎస్, బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘనలపై ఎన్నిక సంఘంకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. మునుగోడులో ప్రచార కార్యచరణ సిద్దం చేసుకున్నట్టుగా చెప్పారు. ఈ రోజు సాయంత్రం చౌటుప్పల్ మండలంలో తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేపట్టనున్నట్టుగా తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు మునుగోడులో అందరూ నాయకులు ఉండి.. బూతులవారీగా, గ్రామాల వారీగా సమీక్ష చేపట్టనున్నట్టుగా చెప్పారు. 

ఇక, ఈ రోజు సాయంత్రం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొయ్యలగూడం నుంచి తంగడ్ పల్లి వరకు కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించనుంది. కొయ్యలగూడెం, దేవులమ్మనాగారం, పీపుల్ పహాడ్, ఎనగండ్ల తండ, అల్లపురం, జైకేసరం, నెలపట్ల, లింగొటం, కుంట్లగూడెం, చౌటుప్పల్ టౌన్ (చిన్నకొండుర్ రోడు) మీదుగా తంగడ్ పల్లి వరకు రోడ్ షో సాగనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR