
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వేస్ట్ పార్టీ అని.. తెలంగాణలో కేసీఆర్ అమ్రిష్‌పురిలా మారిపోయాడని ఆయన సెటైర్లు వేశారు. ఫామ్‌హౌస్‌లో నిమ్మకాయలు పెడుతున్నారు జాగ్రత్త అంటూ బండి సంజయ్ హితవు పలికారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలంటే మంత్రాలు చేయాలని చెప్పారట.. సచివాలయానికి వెళ్లొద్దు అంటే వెళ్లలేదట.. రేపో మాపో ఆ మంత్రగాడికి రాష్ట్రం ఇచ్చి వెళ్లిపోతారంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతకుముందు బండి సంజయ్ కుమార్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ఫైర్ అయ్యారు. తాంత్రిక పూజలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో బెడ్ సిద్దంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఆయన్ను ఇలాగే వదిలేయకూడదంటూ బీజేపీకి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. "ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి" అంటూ ట్వీట్ చేశారు.
ALso REad:బీజేపీ 'తాంత్రిక' వ్యాఖ్యలు.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో బెడ్ సిద్ధంగా ఉందంటూ కేటీఆర్ కౌంటర్
కాగా... తాంత్రికుడి సలహా మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తమ పార్టీ టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారని బండి సంజయ్ కుమార్ శనివారం ఆరోపించారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి నల్ల పిల్లితో చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. కొంతకాలం క్రితం తన ఫామ్‌హౌస్‌లో పనిచేసే వ్యక్తి హఠాత్తుగా మరణించాడనీ, నరబలి కర్మ కారణంగా మరణం సంభవించిందని పుకార్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. "కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు. అదే తాంత్రికుడి సలహా మేరకే మునుగోడులో ఓటుకు రూ.40000 పంచేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. అయితే అంతిమంగా బీజేపీ గెలుస్తుంది అని బండి సంజయ్ కుమార్ చెప్పినట్టు తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది. దానికి బండి సంజయ్ మాట్లాడుతున్న వీడియోను కూడా జత చేసింది.