వీహెచ్‌పై దాడి ఎఫెక్ట్: కాంగ్రెస్‌ నుండి నగేష్ సస్పెన్షన్

By narsimha lodeFirst Published May 13, 2019, 3:44 PM IST
Highlights

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి నగేష్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. తనపై సస్పెన్షన్‌ విధించడంపై నగేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ  విషయమై తాను కోర్టుకు వెళ్తానని నగేష్ హెచ్చరించారు.
 

హైదరాబాద్: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి నగేష్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. తనపై సస్పెన్షన్‌ విధించడంపై నగేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ  విషయమై తాను కోర్టుకు వెళ్తానని నగేష్ హెచ్చరించారు.

రెండు రోజుల క్రితం ఇందిరాపార్క్ ఎదుట  అఖిలపక్షసమావేశం ధర్నా సమయంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పై నగేష్ దాడికి దిగాడు. ఈ దాడిని  కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొంది. 

ఈ విషయమై క్రమశిక్షణ కమిటీ సోమవారం నాడు హనుమంతరావుతో పాటు నగేష్ అభిప్రాయాలను సేకరించింది.వీరిద్దరి అభిప్రాయాలను విన్న తర్వాత నగేష్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 

తనపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నగేష్ తప్పుబట్టారు.  విహెచ్‌కు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకొన్నారని నగేష్ ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను పార్టీ నుండి సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయిస్తానని కూడ హెచ్చరించారు.

తనపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ గాంధీ భవన్‌లోని గాంధీ విగ్రహాం ఎదుట నగేష్ ముదిరాజ్ ధర్నాకు దిగారు. విహెచ్ టీఆర్ఎస్ నేతలకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

click me!