సాగర్‌లో ముగిసిన ఉప ఎన్నిక: భారీగా ఓటింగ్.. 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్

By telugu teamFirst Published Apr 17, 2021, 7:45 AM IST
Highlights

తెలంగాణలోని నాగార్జునసాగర్ శానసశభ సీటు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు సాగనుంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో భారీగా పోలింగ్‌ నమోదు అయింది. సాయంత్రం 5 గంటల నాటికి 81.5 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకే పార్టీ ప్రతినిధులను అనుమతించడం, ఓటరు రసీదులు సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఈసీ ఆదేశించినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద హడావుడి తగ్గింది.

సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. రాత్రి 7 గంటల వరకు క్యూలైన్‌లో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమీషన్  తెలిపింది. మే 2న నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ శానససభ ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు.

తెలంగాణలోని నల్లగొండ శాసనసభ ఉప ఎన్నికలో పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు 53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు.

నాగార్జనసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి కె. జనా రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో ఆయన ఓటేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆయన ఓటేశారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జానారెడ్డి ఓటర్లను కోరారు.

నాగార్జున సాగర్ శాసనసభ సీటు ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్ గోయల్ ఈ విషయం చెప్పారు.తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ శానససభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. 

నాగార్జునసాగర్ శాసనసభ  ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటి పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెసు నుంచి కె. జానా రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి తరఫున రవి నాయక్ పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో నాగార్జునసాగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

click me!