నాగార్జునసాగర్ లో సీన్ రివర్స్: బిజెపికి షాక్, టీఆర్ఎస్ లోకి కడారి అంజయ్య

By telugu teamFirst Published Mar 30, 2021, 7:14 PM IST
Highlights

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీన్ రివర్సయింది. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేయాలని చూసిన బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. బిజెపి నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరారు.

హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో బిజెపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. కడారి అంజయ్య బిజెపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

కడారి అంజయ్య యాదవ్ నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు. అయితే బిజెపి చివరి నిమిషంలో రవి నాయక్ కు టికెట్ ఇచ్చింది. దీంతో కడారి అంజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో ఆయనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. దాంతో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

అంజయ్యను రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఫామ్ హౌస్ లో అంజయ్యను కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. బిజెపి అసంతృప్తులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైన తర్వత ఆ పార్టీ అసంతృప్తులను తమ వైపు లాక్కోవాలనే బిజెపి వ్యూహం బెడిసికొట్టింది. దాదాపుగా సీన్ రివర్స్ అయింది. 

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసిన నివేదితా రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకే బిజెపి టికెట్ వస్తుందనే నమ్మకంతో ఆమె నామినేషన్ వేశారు. అయితే, బిజెపి రవి కుమార్ నాయక్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో నివేదితా రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టికెట్ ఆశించి భంగపడిన కోటిరెడ్డిని కేసీఆర్ స్వయంగా బుజ్జగించారు. 

కాగా, మంగళవారం నామినేషన్లకు తుది గడువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెసు అభ్యర్థి జానా రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బిజెపి అభ్యర్థి రవి నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. 

click me!