జానారెడ్డి : మూడు దఫాలు ఆ సామాజికవర్గం చేతిలో ఓటమి

Published : May 02, 2021, 02:50 PM IST
జానారెడ్డి : మూడు దఫాలు ఆ సామాజికవర్గం చేతిలో ఓటమి

సారాంశం

మూడు దఫాలు ఒకే సామాజికవర్గానికి చెందిన  అభ్యర్ధుల చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. 


నల్గొండ:మూడు దఫాలు ఒకే సామాజికవర్గానికి చెందిన  అభ్యర్ధుల చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. నాగార్జునసాగర్ (గతంలో చలకుర్తి అసెంబ్లీ స్థానం) నుండి జానారెడ్డి ఏడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో  జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో  జానారెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో  తాను చేసిన అభివృద్ది నేపథ్యంలో  ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు.

also read:చేదు అనుభవం: నాడు తండ్రి, నేడు కొడుకు చేతిలో జానారెడ్డి ఓటమి

1994 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ తొలిసారిగా పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఎంకు రాజీనామా చేసిన నోముల నర్సింహ్మయ్య టీఆర్ఎస్ లో చేరారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందుగా ఆయన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగారు. ఈ సమయంలో  నోమలు నర్సింహ్మయ్యపై కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన జానారెడ్డి విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడ నియోజకవర్గాన్ని నర్సింహ్మయ్య వీడలేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిని ఓడించి నర్సింహ్మయ్య మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.  అయితే అనారోగ్యంతో నర్సింహ్మయ్య మరణించడంతో  ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో  నోముల భగత్  ఈ దఫా పోటీకి దిగాడు. ఈ దఫా నోముల భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. మూడు దఫాలు యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధుల చేతిలోనే జానారెడ్డి ఓడిపోయాడు.జానారెడ్డి కాకుండా ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మరొకరిని బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మరింత తగ్గే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

 


 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.