బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి: గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Oct 31, 2023, 1:35 PM IST


మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఇవాళ  బీఆర్ఎస్ లో చేరారు.


హైదరాబాద్: మాజీ మంత్రి  నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే  విష్ణువర్ధన్ రెడ్డిలు  మంగళవారంనాడు  బీఆర్ఎస్ లో చేరారు.  తెలంగాణ సీఎం కేసీఆర్  పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్  అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించారు. కానీ  ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ కూచుకుళ్ల రాజేష్ కు   టిక్కెట్టు కేటాయించింది.   నాగర్ కర్నూల్ నుండి కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకపోవడంతో  నాగం జనార్ధన్ రెడ్డి  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేరాలని  రెండు రోజుల క్రితం  మంత్రులు  కేటీఆర్, హరీష్ రావులు  ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు   నాగం జనార్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న  కేసీఆర్ ను నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు.  ఇవాళ    తన అనుచరులతో  నాగం జనార్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరారు.

Latest Videos

undefined

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి భావించారు. అయితే  విష్ణువర్ధన్ రెడ్డికి కాకుండా అజహరుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. మంత్రి హరీష్ రావు  విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి  బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు.

 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  పలు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా, ఒక్క దఫా  ఇండిపెండెంట్ గా  నాగం జనార్ధన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.  2014 ఎన్నికల సమయంలో నాగం జనార్ధన్ రెడ్డి  బీజేపీలో చేరారు.ఆ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి  నాగం జనార్ధన్ రెడ్డి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు  కూడ ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు.

also read:కాంగ్రెస్ కు షాక్: రాజీనామా చేసిన నాగం జనార్థన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి

కాంగ్రెస్ కీలక నాయకుడు పిజనార్ధన్ రెడ్డి  మరణం తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి విష్ణువర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  విజయం సాధించారు.   ఖైరతాబాద్  అసెంబ్లీ స్థానాన్ని జూబ్లీహిల్స్ , ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాలుగా విభజించారు. జూబ్లీహిల్స్ నుండి  విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అయితే  ఈ దఫా జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించారు. అయితే  కాంగ్రెస్ టిక్కెట్టు దక్కక పోవడంతో కాంగ్రెస్ ను వీడారు  విష్ణువర్ధన్ రెడ్డి.

 

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్ధ‌న్ రెడ్డి, పీజేఆర్ తనయుడు.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి తదితరులు pic.twitter.com/bxB62amUnM

— BRS Party (@BRSparty)
click me!