అంతా అవినీతే... జైలుకు పంపేవరకు వదలను: కేసీఆర్‌పై నాగం ఫైర్

By Siva KodatiFirst Published Oct 20, 2019, 5:51 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని.. ధనిక రాష్ట్రాన్ని, అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ విమర్శించారు. చంద్రశేఖర్ రావును జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని.. ధనిక రాష్ట్రాన్ని, అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ విమర్శించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రశేఖర్ రావును జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.24 వేల కోట్ల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన కేసీఆర్.. ప్రస్తుతం అక్కడి కాంట్రాక్టుదారులకు స్వయంగా దోచిపెడుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నంత అవినీతి దేశంలో ఎక్కడా జరగడం లేదని నాగం దుయ్యబట్టారు.

RTC Strike:కేసీఆర్‌తో పువ్వాడ, సునీల్ శర్మ భేటీ, హైకోర్టు ఆదేశాలపై చర్చ

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై నాటి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాస్తే దానిని పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లనే చేసేలా చంద్రశేఖర్ రావు పరిపాలన సాగిస్తున్నారని జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ నాగం ప్రశ్నించారు.

సెల్ఫ్ డిస్మిస్ అంటూ సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని.. వారి ఉసురు కేసీఆర్‌కు తగులుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల పేరిట అవినీతి చేసేందుకే ముఖ్యమంత్రి తెరదీశారని జనార్థన్ రెడ్డి ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాల కాపీ అందింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఈ నెల 18వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏం చేయాలనే విషయమై సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆదివారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు.

ఈ నెల 5 వతేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

RTC Strike:కేసీఆర్‌తో పువ్వాడ, సునీల్ శర్మ భేటీ, హైకోర్టు ఆదేశాలపై చర్చ

ఆర్టీసీ కార్మికులు రోజు రోజుకూ తమ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన  రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపగా రాష్ట్ర బంద్ ను కూడ ఆర్టీసీ  కార్మికులు విజయవంతంగా నిర్వహించారు.ఈ నెల 18వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సందర్భంగా  తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ హైకోర్టుకు తేల్చి చెప్పింది.

click me!