బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

Published : Dec 26, 2018, 02:24 PM IST
బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మెగా బ్రదర్ నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బాలయ్య ఎవరో తనకు తెలీదంటూ.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మెగా బ్రదర్ నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బాలయ్య ఎవరో తనకు తెలీదంటూ.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా పాపులర్ అయ్యింది కూడా. తాజాగా.. మరోసారి బాలయ్యకి నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

ఓ స్కూల్ విద్యార్థి   చక్కగా.. ఏ మాత్రం తడబడకుండా దేశ భక్తి గీతం సారే జహాసే.. అచ్చా పాడిన వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.   బాలయ్యకు కౌంటర్‌గానే నాగబాబు ఈ వీడియో పోస్టు చేసినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. ఎందుకంటే.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య సారేజ‌హాసె అచ్చా దేశ భక్తి గీతాన్ని ఖూనీ చేసి న‌వ్వుల‌పాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది.

బుల్‌బుల్‌ బాలయ్య అంటూ  బాలయ్యను విపరీతంగా ట్రోల్ చేశారు.  దీనికి కౌంటర్‌గానే నాగబాబు ఈ చిన్నపిల్లోడు పాడిన వీడియో పోస్ట్‌ చేశారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే.. మెగా, నందమూరి ఫ్యామిలీలు ఒకటౌతున్నాయనుకున్న సమయంలో.. ఇలా బాలకృష్ణ, నాగబాబు ఒకరిమీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం చర్చనీయాంశమైంది. 

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu