Medak: మెదక్ ఎంపీ సీటుపై మైనంపల్లి హనుమంతరావు దృష్టి!

By Mahesh K  |  First Published Feb 6, 2024, 9:29 PM IST

మెదక్ ఎంపీ సీటు పై మైనంపల్లి హనుమంతరావు ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఆయన కార్యకలాపాలు ప్రారంభించారు. మెదక్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్ గెలిచిన విషయం విధితమే.
 


మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మళ్లీ మెదక్ పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తున్నది. మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన మెదక్ నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు ప్రారంభిస్తుండటం గమనార్హం.

మొన్నటి వరకు మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యం వహించారు. తనకు, తన తనయుడు రోహిత్‌కు బీఆర్ఎస్ టికెట్లు కావాలని డిమాండ్ చేశారు. కానీ, కేసీఆర్ కాదనడంతో ఆయన పార్టీ వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తండ్రి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయినా.. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కొడుకు రోహిత్ గెలిచాడు. మైనంపల్లి హనుమంతరావు గతంలో మెదక్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

Latest Videos

Also Read: KCR: కేసీఆర్‌కు జగన్ పరిస్థితే! రెండు పార్టీలకూ అదే సవాల్

ఇప్పుడు ఆయన తన అదృష్టాన్ని మెదక్ ఎంపీ స్థానం నుంచి పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేస్తున్నది. మెదక్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

click me!