
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నారాయణగూడ మెట్రో స్టేషన్ కింద హత్య జరిగింది. దీనిని గమనించి ప్రయాణికులు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
వాగ్వాదం.. ఘర్షణకు దారి తీసి అందులో ఓ వ్యక్తి , మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.