
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రైతులకు పరిహారం అందే విషయంలో అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. తెలంగాణ జెఎసి సైతం సాగునీట ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం విషయంలో సర్కారు వైఖరిని ఎండగడుతున్నది. తాజాగా నల్లగొండ జిల్లా మనుగోడు నియోజకవర్గానికి చెందిన ఒక టిఆర్ఎస్ నేత స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితులయ్యే బాధిత రైతాంగానికి సకాలంలో పరిహారం అందించని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో వివరించారు. ఆ లేఖలో పేర్కొన్న సమాచారం ఇలా ఉంది.
శ్రీ యుత గౌరవనీయులు భారీ నీటి పారుదల శాఖ మాత్యలు మంత్రి తన్నీరు హరీష్ రావు గార్కి,
విషయం:-
చర్లగూడెం రిజర్వాయర్ క్రింద భూమి కోల్పోయిన రైతుల భూపరిహరం,వారి అందోళన గురించి. KCR గారు తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి తెలంగాణ ప్రజల ఆదరాభిమానంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లొరైడు ప్రాంతమైన మా మునుగోడును గుర్తించి సాగునీరు, త్రాగునీరు కోసం డిండి ద్వారా 12 TMC సామర్థ్యంతో చర్లగూడెంలో రిజర్వాయర్ ను ఏర్పాటుకు అనుమతులు మంజూరుచేసి,పనులు స్టార్టు చేసినారు.
ఈ ప్రాజెక్టుకు సుమారు 3600 ఎకరాల భూమి అవసరం అని అధికారులు రైతులతో మాట్లాడి 1200 ఎకరాలకు రైతులకు భూపరిహరం ఇవ్వడం,మీగతా 2400 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాకుండ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు అని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు చేయకుండా అడ్డుకుంట్టన్నరు అక్కడి తెలంగాణ నాయకులుగా మేము రైతుల తో మాట్లాడం జరిగింది. అయితే వారి ఆందోళనకు కారణం భూపరిహరం అందకపోవడమే.
భూపరిహరం తక్కువ అని ఇండ్ల నివాసం ఏర్పాటు చేయాలని, ఆందోళన తో సతమతమవుతూ దీక్షలు చేపట్టారు. మాతో మంత్రి గారిని కల్పించాలని ఇక్కడి రైతులు పదే పదే వేడుకుంటాన్నారు. కావున దయచేసి మీరు టైమ్ ఇస్తే మునుగోడు ప్రాంత రైతులు మీవద్దకు వచ్చి వారి సమస్యలు విన్నవించుకుంటారు. సమస్య కూడా పరిస్కారం కావచ్చు... తమరు సానుకూలంగా ఈ విషయాన్ని పరిశీలించగలరని మనవి.
ఇట్లు
మీ అనుచరుడు,
వేనేపల్లి వెంకటేశ్వరరావు,
TRS నాయకుడు, మునుగోడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి