తెలంగాణలో ప్రైవేటు దవఖానాలు మూతపడుతున్నయట

First Published Sep 4, 2017, 1:50 PM IST
Highlights
  • మంత్రి హరీష్ రావు ఆశ్చర్యకర ప్రకటన
  • కేసిఆర్ కిట్ల పథకంతో ప్రయివేటు ఆసుపత్రులు మూత పడ్డాయి
  • విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తున్నాము

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి, సిఎం మేనల్లుడు హరీష్ రావు ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. తెలంగాణలో కేసిఆర్ కిట్ల పంపిణీ లాంటి పథకాలు మొదలైన నాటి నుంచి ప్రయివేటు ఆసుపత్రులు మూతపడుతున్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. నర్సాపూర్ లో 200 కూడా దాటని ప్రసవాలు ప్రస్తుతం 350 దాటాయని చెప్పారు.

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్య,  వైద్యం సహా అనేక రంగాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ బలోపేతం చేస్తున్నామన్నారు. గవర్నర్ కూడా గాంధీ లాంటి దవాఖానాల కే వెళుతున్నారని, మంత్రులు కూడా ప్రభుత్వ దవాఖానాలకే వెళుతున్నారని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రూ.600 కోట్లతో కేసీఆర్ కిట్ల పథకం అమలు అవుతున్నదని హరీష్ వివరించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా హాస్పిటల్ ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్ లోని వివిధ విభాగాలను ప్రారంభించిన మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఆయా విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు అనంతరం జరిగిన సభలో మంత్రి హరీష్ రావుతోపాటు లక్ష్మారెడ్డి,, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!