తెలంగాణలో ఒప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఇప్పుడు లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:Telangana లో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి Congress లో ప్రాధాన్యత లేదన్నారు
సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎల్పీనేత Mallu Bhatti Vikramarka తో భేటీ ముగిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనతో మాట్లాడేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వచ్చారన్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చినవారికి పార్టీలో పదవులు ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారుHuzurabad bypoll ఈటల రాజేందర్ కు బీజేపీ తోడైందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అందుకే ఈటల రాజేందర్ విజయం సాధించారన్నారు.
undefined
అభివృద్ది కోసం కోట్ల రూపాయాలు నిధులు తీసుకురావాల్సిన మంత్రులు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి తనపై నిన్న చేసిన విమర్శలపై కూడా Komatireddy Rajagopal Reddy స్పందించారు.
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసే మంత్రి స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవాలని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. జిల్లాకు చెందిన ప్రాజెక్టులు నిలిచిపోయి అభివృద్ది ఆగిపోతే మాట్లాడే దమ్ము ధైర్యం మంత్రికి లేదన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చే చెక్కులను మంత్రి ఇస్తున్నారన్నారు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు లేవన్నారు.భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో వందసార్లు తిరిగినా ఒక్కటే, తాను ఒక్కసారి నియోజకవర్గంలో పర్యటించినా ఒక్కటేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా తాను తన స్వంత నిధులను మునుగోడు నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ఏం మాట్లాడానో మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీడియాకు చెప్పాల్సిన మాటలను చెబుతామన్నారు.
also read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి భేటీ:మునుగోడు ఎమ్మెల్యేకి బుజ్జగింపులు
అంతకు మించి మా మధ్య సంభాషణ గురించి మీడియా వద్ద ప్రస్తావించలేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను , భట్టి విక్రమార్కలు అన్నదమ్ముల్ల మాదిరిగా ఉన్నామన్నారు. తాను కాంగ్రెస్ కి దూరమౌతాననే ఆవేదనతో మాట్లాడేందుకు వచ్చినట్టుగా చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను బీజేపీ ఓడిస్తుందని కన్‌ఫ్యూజన్ తో కాదు, క్లారిటీతోనే చెప్పానన్నారు.
సీఎల్పీ పదవి విషయమై తాను గతంలో తాను పోటీ పడినట్టుగా గుర్తు చేశారు. తనకు ఇవ్వకపోతే భట్టి విక్రమార్కకు ఈ పదవిని ఇవ్వాలని కూడా తాను పార్టీ నాయకత్వానికి సూచించినట్టుగా చెప్పారు. నా ఇమేజ్ ను డ్యామేజీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకొంటుందని తాను చెప్పిన మాట వాస్తవం కాదా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనమైన తర్వాత పీసీసీ చీఫ్ ను కూడా మార్చాలని తాను కోరానని చెప్పారు. కానీ పీసీసీ చీఫ్ ను మార్చలేదన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా ఎఐసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశానన్నారు.