కుమరం భీమ్ జిల్లాలో వాగులో చిక్కుకున్న సాయినాథ్: రక్షించిన గజ ఈతగాళ్లు

Published : Jul 25, 2022, 04:57 PM IST
కుమరం భీమ్ జిల్లాలో వాగులో చిక్కుకున్న సాయినాథ్: రక్షించిన గజ ఈతగాళ్లు

సారాంశం

కొమరం భీమ్ జిల్లాలోని బాబాసాగర్ వాగులో చిక్కుకున్న వ్యక్తిని స్థానికులు  సురక్షితంగా కాపాడారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లర్ల ఏర్పాటు  చేసిన ఇనుప చువ్వలను పట్టుకొని  సాయినాథ్ నిలబడ్డాడు.  సాయినాథ్ కు తాడును ఇచ్చి సాయినాథ్ ను సురక్షితంగా వాగు నుండి బయటకు తీసుకు వచ్చారు స్థానికులు 

ఆదిలాబాద్:  Kumaram Bheem Asifabad జిల్లా చింతలమానేపల్లి మండలం బాబా సాగర్ వాగులో సాయినాథ్ చిక్కుకున్నారు. Vaggu లో వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆయన వరదలో కొట్టుకుపోతూ వాగుపై రాకపోకల కోసం నిర్మిస్తున్నBrigde  పిల్లర్లకు ఉన్న ఇనుప చువ్వలను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు Sainath .  

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సాయినాథ్ ను  కాపాడేందుకు గజ ఈతగాళ్లను రప్పించారు. వాగులోకి దిగి సాయినాథ్ కు తాడు అందించారు. ఈ తాడు సహాయంతో సాయినాథ్ ను గజఈతగాళ్లు సాయినాథ్ ను కాపాడారు.  జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు  పొంగిపొర్లుతున్నాయి.  గత 10 రోజుల క్రితం గోదావరికి భారీ వరదలు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. 

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు గతంలో రానంత స్థాయిలో వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు 5 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో  ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి చెందిన 25 గ్రామాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాటు గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో మంచిర్యాల పట్టణంలోకి వరద నీరు వచ్చింది. 

పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఇంటిలో ఉన్న వ్యక్తిని  కాపాడారు. మరో వైపు  పశువులను ఇంటికి తీసుకు వచ్చేందుకు వెళ్లిన ఇద్దరు వరద నీటిలో చిక్కుకున్నారు వరద నీటి నుండి కాపాడుకొనేందుకు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఇద్దరిని హెలికాప్టర్ సహాయంతో  వారం రోజుల క్రితం అధికారులు రక్షించారు.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu