మునుగోడు ఉప ఎన్నికల్లో చరిత్ర సృష్టించే తీర్పివ్వాలి: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 25, 2022, 4:28 PM IST
Highlights


ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో  కేసీఆర్ కు బుద్ది చెప్పాలని ఆయన  ప్రజలను కోరారు. 
 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించే తీర్పును ఇవ్వాలని  బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.ఆదివారం నాడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను నియంతలా సాగిస్తున్న కేసీఆర్ కు మునుగోడు ఎన్నికల్లో ప్రజలు  బుద్ది చెప్పాలన్నారు. కుటుంబ పాలన చేస్తూ సీఎం  కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని  ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిగా మార్చారన్నారు.

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి గత నెల 4వ తేదీన రాజీనామా చేశారు . అదే రోజున కాంగ్రెస్ పార్టీ చీప్ సోనియా గాంధీకి లేఖను పంపారు. గత నెల 8వ తేదీన  ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గత నెల 21వ తేదీన రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.  ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 

ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఈ స్థానంలో విజయం కోసం మూడు పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. 

also read:మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీ.. ప్రతి గ్రామంలో పాదయాత్రకు ప్లాన్..!

మునుగోడుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకించి కేంద్రీకరించారు. ప్రచార కమిటీ చైర్మెన్ గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  ఏడు మండలాలకు ఇంచార్జీలను కాంగ్రెస్ పార్టీ నియమించింది.ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున ఇంచార్జీలను నియమించారు. మరో వైపు బీజేపీ కూడా మునుగోడుపై కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చైర్మెన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. బీజేపీకి చెందిన కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. బీజేపీ నేతలు కూడా మునుగోడు నియోజవకర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


 

click me!