జహీరాబాద్​లో వివాహితపై సామూహిక అత్యాచారం..!

Published : Sep 25, 2022, 03:43 PM ISTUpdated : Sep 25, 2022, 03:50 PM IST
జహీరాబాద్​లో వివాహితపై సామూహిక అత్యాచారం..!

సారాంశం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. వివరాలు.. 24 ఏళ్ల వివాహితపై జహీరాబాద్ సమీపంలో కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే అనుమానస్పద స్థితిలో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మహిళను సఖీ కేంద్రానికి తరలించారు. 

వివాహితను ఆటోలో జహీరాబాద్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అయితే కొన్నాళ్లుగా ఆమె భర్తతో దూరంగా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసుల వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?