మునుగోడులో ఇండిపెండెంట్ గా పోటీ చేసే గెలిచే సత్తా ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By narsimha lode  |  First Published Sep 4, 2022, 5:42 PM IST

మునుగోడులో ఇండిపెండెంట్ గా పోటీ  చేసి గెలిచే సత్తా ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.తనపై నోరు పారేసుకొంటే మునుగోడులో రేవంత్ రెడ్డిని తిరగనివ్వబోమన్నారు. తనపై చార్జీషీట్ విడుదల చేసే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. 


మునుగోడు:మునుగోడులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.ఆదివారం నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు. తనపై నోరు జారితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిరగనివ్వబోనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను నిజాయితీగా పోరాటం చేసిన వ్యక్తిని అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. తనపై చార్జీషీట్ చేసే స్థాయి రేవంత్ రెడ్డిది కాదన్నారు. 

, నేర చరిత్ర, అవినీతి చరిత్ర రేవంత్ రెడ్డిదని అందుకే ఆయనకు పార్టీ అండ అవసరమన్నారు. తాను పార్టీని కాపాడడం కోసం ప్రయత్నించినట్టుగా చెప్పారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడేందుకు  ప్రయత్నించినట్టుగా చెప్పారు. ఓటమి పాలయ్యే సీట్లలో పోటీ చేసి తాను విజయం సాధించినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఓటమి  చెందే స్థానాల్లో విజయం సాధించానని రాజగోపాల్ రెడ్డి వివరించారు. 

Latest Videos

గత నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. గత నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.  గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి గా మునుగోడు నుండి పోటీ చేసి విజయం సాధించారు.త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.మునుగోడులో విజయం సాధించాలని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడులో తమ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 

click me!