రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ.. మునుగోడు ఉపపోరు కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం..!

By Rajesh KarampooriFirst Published Nov 6, 2022, 8:32 AM IST
Highlights

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును ప్రారంభమైంది. నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గత నెలరోజులుగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తోందో.. పార్టీ గెలుపు బావుటను ఎగరవేస్తోంది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.  ఈ  నియోజకవర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా.. 2,25,192మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి చేరుకున్నారు.  

ఓట్ల కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా..  15 రౌండ్లలో లెక్కింపు జరుగనున్నది. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్‌వైజర్ ,అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంటల వరకు తుది ఫలితం 
విడుదల అయ్యే అవకాశముంది. 1,2,3, రౌండ్లలో చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు. 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండల ఓట్లను, 7,8 రౌండ్లలో మునుగోడు మండల ఓట్లను, 9,10 రౌండ్లలో చండూరుమండల ఓట్లను..  ఇక 11, 12, 13, 14, 15 రౌండ్లలో మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కిస్తారు. 

click me!