మునుగోడు బై పోల్.. నేడు 16 నామినేషన్లు దాఖలు..

Published : Oct 10, 2022, 05:34 PM IST
మునుగోడు బై పోల్.. నేడు 16  నామినేషన్లు దాఖలు..

సారాంశం

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు నామినేషన్లు దాఖలు చేసినవారిలో.. 14 మంది స్వతంత్రులు ఉన్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చండూరులోని బంగారుగడ్డ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

ఇక, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. మరో 14 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థులు సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. అయితే మునుగోడులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ అభ్యర్థుల మధ్యే పోరు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. 

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన టీఆర్ఎస్ నేతలు భాను ప్రకాష్, వినయ్ భాస్కర్.. మునుగోడు పోలింగ్‌లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల్లో 8 గుర్తుల వల్ల టీఆర్ఎస్‌పై ప్రభావం పడిందని చెప్పారు. అలాగే కేసీఆర్‌పై నిరాధర ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ