పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదు: బీజేపీ షోకాజ్ కు రాజాసింగ్ సమాధానం

By narsimha lode  |  First Published Oct 10, 2022, 5:23 PM IST

పార్టీ నియామావళికి వ్యతిరేకంగా తాను పనిచేయలేదని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.  ఈ ఏడాది ఆగస్టు23న బీజేపీనాయకత్వం పంపిన షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ వివరణ ఇచ్చారు. 
 


హైదరాబాద్:  తాను పార్టీకి నియామావళికి వ్యతిరేకంగా ఏనాడూ పనిచేయలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్ వివరణ పంపారు. ఈ ఏడాది ఆగస్టు 23 వ తేదీన బీజేపీ ఇచ్చిన  షోకాజ్ నోటీసుకు ఇవాళ రాజాసింగ్ సమాధానం పంపారు. ప్రజలకు,హిందూ మతానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని  ఆ లేఖలో కోరారు రాజాసింగ్. కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని రాజాసింగ్ తేల్చి చెప్పారు. పార్టి నియమాలను తాను ఏనాడూ ఉల్లంఘించలేదన్నారు.  హిందూ ధర్మం కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు.  అందుకే ఎంఐఎం, టీఆర్ఎస్ లు కుట్ర పన్ని తనపై కేసులు నమోదు చేశారని  రాజాసింగ్ ఆ లేఖలో ఆరోపించారు. 

 ఈ ఏడాది ఆగస్టు 25న రాజాసింగ్ ను పీడీయాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలులో రాజాసింగ్  ప్రస్తుతం ఉన్నారు.  మునావర్ షో ను హైద్రాబాద్ లో నిర్వహించవద్దని  రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ షో నిర్వహిస్తే అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. బీజేవైఎం నేతలు ఈ విషయమై డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసీ ఈ షో ను నిర్వహించారు.ఈ షో ముగిసిన తర్వాత  రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో వివాదాస్పదమైంది.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యాలున్నాయని ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే  రోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.  అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  పోలీసుల వినతి మేరకు ఈవీడియోను యూట్యూబ్ తొలగించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో బెయిల్ పై  వచ్చిన రాజాసింగ్ పై  పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసింది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. 

Latest Videos

undefined

యూట్యూబ్ లో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో  మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద  వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేశారు.  15 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను బీజేపీ ఆదేశించింది. అయితే పీడీ యాక్ట్ తో  జైలులో ఉన్నందున  వివరణకు మరింత సమయం ఇవ్వాలని రాజాసింగ్ భార్య ఉషాబాయ్  కోరారు.  ఇవాళ బీజేపీ నాయకత్వానికి  సమాధానం పంపారు రాజాసింగ్. 

also read:పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్

రాజాసింగ్ సమాధానంపై బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బీజేపీ సభల్లో రాజాసింగ్  ఎక్కడ అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేస్తున్న పరిస్థితి కన్పించింది.  ఈ వివరణతో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది. 
 

click me!