పూర్తైన నయీం అనుచరుడు శేషన్న కస్టడీ: చంచల్ గూడ జైలుకి తరలింపు

By narsimha lode  |  First Published Oct 10, 2022, 5:02 PM IST

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ పూర్తైంది. శేషన్నను పోలీసులు కోర్టులో హాజరు పరిస్తే ఆయనను14 రోజుల రిమాండ్ విధించింది.


హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ పూర్తైంది.  శేషన్నను సోమవారం నాడు పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు శేషనన్ను పోలీసులు విచారించారు. శేషన్న కస్టడీని పోలీసులు రహస్యంగా ఉంచారు. కస్టడీ పూర్తి కావడంతో శేషన్నను సోమవారం నాడు పోలీసులు  నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో శేషన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శేషన్నను  చంచల్ గూడ జైలుకు తరలించారు.

శేషన్న కస్టడీ కోరుతూ  హైద్రాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో ఈ ఏడాది సెప్టెంబర్ 30 పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు శేషన్నను కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 7నుండి 10వ తేదీ వరకు శేషన్నను పోలీసులు విచారించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న కొత్తపేటలో శేషన్న సెటిల్ మెంట్ చేస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  ఆయుధాలను  అక్రమంగా తరలిస్తున్నారని  శేషన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. నయీం ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్న నుండి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. నయీం ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత శేషన్న ఎక్కడ ఉన్నాడు, శేషన్ యాక్షన్ టీమ్ లో ఎందరున్నారనే  విషయాలపై పోలీసులు విచారించినట్టుగా ప్రచారం సాగుతుంది.

Latest Videos

also read:గ్యాంగ్ స్ఠర్ నయీం అనుచరుడు శేషన్న: కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్

హైద్రాబాద్ హుమాయున్ నగర్ లో అక్బర్ అనే వ్యక్తికి  శేషన్న తుపాకీని విక్రయించారు. అక్బర్ ఇచ్చిన సమాచారం మేరకు శేషన్నపై పోలీసులు నిఘాను పెట్టారు.  కొత్తపేటలో సెటిల్ మెంట్ చేసే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

click me!