మహిళా ఉద్యోగిని తో మున్సిపల్ అధికారి రాసలీలు.. ఆడియో క్లిప్ వైరల్

Published : Nov 10, 2018, 11:54 AM IST
మహిళా ఉద్యోగిని తో మున్సిపల్ అధికారి రాసలీలు.. ఆడియో క్లిప్ వైరల్

సారాంశం

మున్సిపల్ అధికారి.. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెతో ఫోన్ లో నే రాసలీలలు నడిపాడు.

మున్సిపల్ అధికారి.. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెతో ఫోన్ లో నే రాసలీలలు నడిపాడు. కాగా... ఆ ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మున్సి పల్‌ అధికారి. 10 రోజల క్రితమే కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించాడు. తన కింద పనిచేసే సిబ్బందికి మద్యం, మాంసంతో విందు ఏర్పాటు చేసి మహిళా సిబ్బందిని కూడా ఆహ్వానించాడు. అందరూ ఆ విందులో పాల్గొనగా విందు మాటులో విలాసాలకు పాల్పడేందుకు యత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సదరు అధికారి ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్‌ రికార్డు చొప్పదండిలో వైరల్‌ అయ్యింది. ఆయన బాధ్యత తీసుకున్న నాటి నుంచే మహిళా సిబ్బందిపై కన్నేశాడు. సెల్‌ఫోన్‌లో తరచు మాట్లాడుతూ సమయం ఇవ్వమని కోరాడు. చెవి రింగులు కొనుగోలు చేశానని, వస్తే ఇస్తానని ఓ మహిళా ఉద్యోగినికి చెప్పాడు. తనకు అలాంటివి నచ్చవని, వద్దంటూ ఆమె సున్నితంగా తిరస్కరించింది. కాగా.. ఇప్పుడు అతని విషయం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌