ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం

Published : Jan 16, 2019, 05:10 PM IST
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్  బుధవారం నాడు ప్రమాణం చేశారు.రాజ్‌భవన్‌లో  రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రమాణం చేయించారు. 

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్  బుధవారం నాడు ప్రమాణం చేశారు.రాజ్‌భవన్‌లో  రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రమాణం చేయించారు. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల్లో కొత్తగా ఎన్నికైన  ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.
ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ‌ముంతాజ్ అహ్మద్ ప్రమాణం చేయిస్తారు. 

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన  ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను గవర్నర్ నరసింహాన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందించారు.ముంతాజ్ అహ్మద్ ఖాన్ ‌ ప్రస్తుతం చార్మినార్  అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  

గురువారం నాడు రెండు గంటల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. స్పీకర్  పదవి ఎన్నికకు రేపు నోటీఫికేషన్ వెలువడనుంది.ఈ నెల 18వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?