వందల కోట్లు ఖర్చు చేసిన తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
హైదరాబాద్: రూ. 100 కోట్లు ఖర్చు చేసి తనను ఓడిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ కు చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు మిడతలదండుగా దండెత్తారని సీతక్క ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గత వారంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినందునే తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని సీతక్క ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా తాను ములుగు ప్రజలకు సేవలు చేస్తున్నానని సీతక్క చెప్పారు. గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
undefined
వరదలు, కరోనా, అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అధికార పార్టీ నేతలు ఎక్కడ పోయారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలో వాలిపోయారని ఆమె విమర్శించారు.
ములుగు అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి బడే నాగజ్యోతి బరిలోకి దిగనుంది. గత నెల 21న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నాగజ్యోతికి చోటు దక్కింది. నాగజ్యోతి ములుగు జిల్లా పరిషత్ వైఎస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. సీతక్కను ఎదుర్కొనే ధీటైన అభ్యర్ధి నాగజ్యోతి అవుతుందని ఆ పార్టీ భావించింది. నాగజ్యోతిని బరిలోకి దింపింది.
ములుగు అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. నాగజ్యోతిని అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ తరుణంలో తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని సీతక్క హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ములుగు అసెంబ్లీ స్థానం నుండి గతంలో టీడీపీ అభ్యర్ధిగా కూడ సీతక్క ప్రాతినిథ్యం వహించారు. రేవంత్ రెడ్డితో పాటు ఆమె టీడీపీని వీడారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారుగా సీతక్కకు పేరుంది.
also read:ములుగులో సీతక్కపై మహిళ అభ్యర్థిని దింపిన బీఆర్ఎస్: ఎవరీ నాగజ్యోతి?
సీతక్క గతంలో ఆమె నక్సలైట్ గా పనిచేశారు. జన జీవన స్రవంతిలో కలిసిన తర్వాత సీతక్క టీడీపీలో చేరారు. ములుగు నుండి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బడే నాగజ్యోతి పేరేంట్స్ కూడ నక్సలైట్లుగా పనిచేశారు. దీంతో నాగజ్యోతిని బీఆర్ఎస్ బరిలోకి దింపిందనే ప్రచారం కూడ లేకపోలేదు.