హైద్రాబాద్‌ జీడిమెట్లలో జనావాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్,పేలుడు: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

Published : Jun 01, 2022, 04:29 PM ISTUpdated : Jun 01, 2022, 05:20 PM IST
హైద్రాబాద్‌ జీడిమెట్లలో జనావాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్,పేలుడు: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్ జీడిమెంట్ల సుభాష్ నగర్ లో బుధవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఇళ్ల మధ్యే గ్యాస్ రీ పిల్లింగ్ చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: Hyderabad నగరంలోని jeedimetla  సుభాష్ నగర్ లో బుధవారం నాడు విషాదం చోటు చేసుకుంది. ఇళ్ల మధ్యే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో Mukhund అనే యువకుడు మరణించాడు. ముకుంద్ శరీరం రెండు ముక్కలైంది. ;ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడే ఉన్న Vijay, kumar అనే ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సూరారం ఆసుపత్రికి తరలించారు.

also read:అనంతపురంలో విషాదం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి...

ఇంటి సెల్లార్ ప్రాంతంలో Gas రీఫిల్లింగ్  చేస్తున్నారని స్థానికులు అధికారులకు పిర్యాదు చేస్తున్నారు. రెండేళ్ల నుండి జవాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్ చస్తున్నారు.  స్థానికుల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదు. బుధవారం నాడు గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ వాల్వ్ లీక్ కావడంతో పేలుడు చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

తాము పదే పదే ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్దంగా జనావాసాల మధ్యే గ్యాస్ రీ పిల్లింగ్ చేస్తుండడంతో స్థానికులు భయంతో గడుపుతున్నారు. అధికారులు పట్టించుకొంటే ఇవాళ ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  గ్యాస్ రీ పిల్లింగ్  చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జనవాసాల మధ్య అసలు చేయకూడదు. ఈ నిబంధనలను పట్టించుకోలేదు. రెండేళ్లుగా సుభాష్ నగర్ లో యధేచ్చగా గ్యాస్ రీపిల్లింగ్ కొనసాగుతుందని స్థానికులు చెప్పారు.

గ్యాస్ సిలిండర్ ప్రమాదాలపాటు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో  ప్రమాదాలు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. 

2021 నవంబర్ 23న  హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని నానక్ రామ్ గూడలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇళ్లు మొత్తం ధ్వంసం అవడమే కాదు భారీగా మంటలు చెలరేగి 11మంది గాయపడ్డారు.  

ఈ విషయమై  ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఏడాది మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చనిపోయాు. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్  పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పై కప్పు కూడా కూలింది.

2021 నవంబర్ చివర్లో నెల్లూరులోని అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో  తెల్లవారుజామున గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లంతా ధ్వంసమై అబ్బాస్ తో పాటు అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతిచెందారు. వీరి కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

అబ్బాస్, నౌషాద్ దంపతులు నెల్లూరులో టిఫిన్ సెంటర్ నడిపిస్తూ జీవనం సాగిస్తారు. ఇదే క్రమంలో ఉదయం టిఫిన్ తయారు చేయడానికి గ్యాస్ స్టౌవ్ వెలిగించడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే  అప్పటికే గ్యాస్ లీకౌన విషయాన్ని గుర్తించక స్టౌవ్ వెలిగించడంతో పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో నౌషాద్ కు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన భర్త అబ్బాస్ కాపాడడానికి వెళ్లడంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే వీరి పదమూడేళ్ల కూతురు అయేషా అక్కడే ఉండడంతో ఆమెకు కూడా Fires అంటుకున్నాయి. అయితే ప్రమాదాన్ని గమనించిన స్తానికులు అయేషాను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయేషా మరణించింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu