కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరిన ముద్దసాని కశ్యప్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 21, 2021, 9:18 PM IST
Highlights

 హూజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.హూజూరాబాద్ 2001నుంచి టిఆర్ఎస్ కు కంచుకోటగా ఆయన గుర్తు చేశారు. హూజూరాబాద్ లో తిరిగి ఎగిరేది గులాబీ జెండానేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

హుజూరాబాద్: హూజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.హూజూరాబాద్ 2001నుంచి టిఆర్ఎస్ కు కంచుకోటగా ఆయన గుర్తు చేశారు. హూజూరాబాద్ లో తిరిగి ఎగిరేది గులాబీ జెండానేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ నేత ముద్దసాని కశ్యప్ రెడ్డి సోమవారం నాడు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ ల  కశ్యప్ టీఆర్ఎస్ లో చేరారు. కశ్యప్ మెడలో గులాబీ  కండువా కప్పి హరీష్ రావు టిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు 2014లో టిడిపి నుంచి హూజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన కశ్యప్ టిఆర్ఎస్ లో చేరడం హర్షనీయమన్నారు.కెసిఆర్ నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న పార్టీగా టిఆర్ఎస్ ను హుజూరాబాద్ ప్రజలు ఆదరించారన్నారు.ఇక్కడి ప్రజలు ఆత్మాభిమానం,ఆత్మగౌరవం కలవారని ఆయన పేర్కొన్నారు.
 రానున్న ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ కు తప్పక పట్టం కడతారన్నారు.
 
 ముఖ్యమంత్రి కెసిఆర్ సుపరిపాలన అందిస్తున్నారని టీఆర్ఎస్ లో చేరిన కశ్యప్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారుత్వరలో హూజూరాబాద్ లో జరిగే మీటింగ్ లో వందలాది మంది కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరుతారని ఆయన చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ విజయం సాధించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతానన్నారు.


 

click me!