యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

Published : Jun 21, 2021, 08:07 PM IST
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

సారాంశం

 యాదాద్రి ఆలయం పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం  నాడు పరిశీలించారు.  

యాదాద్రి:  యాదాద్రి ఆలయం పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం  నాడు పరిశీలించారు.  తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి ఆలయ అభివృద్ది పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. వరంగల్ నుండి హైద్రాబాద్ కు వెళ్తూ యాదాద్రిలో ఆలయ అభివృద్ది పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.

 తొలుత సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు.  ఆ తర్వాత ఆలయం పరిసరాల్లో తిరుగుతూ పనులను పరిశీలించారు.  ఆలయ పనుల పురోగతిని సీఎం అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపాల కాంతులతో వెలగిపోతున్న ఆలయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు.


 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?