ఆ కేసుతో నాకు సంబంధం లేదు.. టీజీ వెంకటేష్

Published : Apr 20, 2022, 01:00 PM IST
ఆ కేసుతో నాకు సంబంధం లేదు.. టీజీ వెంకటేష్

సారాంశం

బంజారాహిల్స్ స్థల వివాదంలో తనకు ఏ సంబంధం లేదని.. ఆధోనిలో టీజీ ఇంటిపేరు గలవాళ్లు చాలామంది ఉంటారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఓ వీడియో విడుదల చేశారు. టీజీ విశ్వప్రసాద్ లో కూడా టీజీ ఉండడమే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ :  Banjara Hills ఆస్తి వివాదంతో తనకు సంబంధం లేదని బీజేపీ ఎంపీ TG Venkatesh అన్నారు. TG Vishwaprasad పేరు కూడా టీజీవీ కావడంతో తన ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పారు. మొదట్లో FIRలో తన పేరు లేదని ఆ తరువాత చేర్చారని తెలిపారు. ఈమేరకు టీజీ వెంకటేష్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేనట్లు పోలీసులకు విశ్వప్రసాద్ తెలిపారన్నారు. ఆదోని ప్రాంతంలో టీజీ ఇంటి పేరుతో చాలా మంది ఉంటారని చెప్పారు.

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కు సంబంధించిన స్థల వివాదం వ్యవహారంలో ఎంపీ టిజి వెంకటేష్ పేరును బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు. ఏ-5గా టీజీ వెంకటేష్, ఏ-1గా టీజీ విశ్వప్రసాద్ ను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 58 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారు. 

ఇదిలా ఉండగా, ఆదివారం andhrapradesh రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన ముఠా Banjara Hills in Hyderabad లో అరాచకం సృష్టించింది. మారణాయుధాలతో కలకలం సృష్టించారు. 90 మందితో కూడిన Adoni gang బంజారాహిల్స్ లోని వంద కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించికునేందుకు ప్రయత్నించింది. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డులను ముఠా సభ్యులు మారణాయుధాలతో బెదిరించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 63 మందిని అరెస్టు చేశారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడి సోదరుడికి చెందిన ముఠాగా దాన్ని అనుమానిస్తున్నారు. 

అరెస్టు చేసిన 63 మందికి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో బంజారాహిల్స్ లో విలువైన స్థలం విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రోడ్ నెంబర్ టెన్ లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు 2005లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మరో అచ ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.

అయితే ఈ జాగా తమదేనంటూ కొందరు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత పీజీ విశ్వప్రసాద్ కొద్ది రోజుల కిందట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన కొందరు వాహనాల్లో పరారయ్యారు. 63 మందిని అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేష్, విశ్వ ప్రసాద్, వీవీఎస్ శర్మ తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. 

స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. గతంలోనూ ఈ స్థలం విషయంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. స్థలానికి చెందిన చీఫ్ సెక్యూరిటీ అధికారి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు  మేరకు  పట్టుబడిన వారి పై హత్యాయత్నం కేసుతోపాటు అక్రమ ప్రవేశం, సమూహంగా వచ్చి దాడి చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.  స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?