మేడం నా కిడ్నీ తీసుకోండి

Published : Nov 18, 2016, 09:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మేడం నా కిడ్నీ తీసుకోండి

సారాంశం

విదేశాంగ మంత్రి సుష్మకు ఎంపీ రాయపాటి  లేఖ

టీడీపీ ఎంపీ, ప్రముఖ వ్యాపార వేత్త, 73 ఏళ్ల రాయపాటి సాంబశివరావు తన ఉదారతను చాటుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు తన కిడ్నీ స్వీకరించాలని పార్లమెంట్ లోని విదేశాంగశాఖ మంత్రి కార్యాలయానికి ఆయన లేఖ పంపారు. కిడ్నీ ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని ఆయన లేఖలో తెలిపారు.

 

సుష్మా తనకు చిరకాల మిత్రులని, ఆమె రాజకీయాల్లో ఇంకా ఉండాల్సిన అవసరం ఉందని, అటు వంటి నేత దేశానికి ఎంతో అవసరమని, అందుకే తాను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చానని రాయపాటి మీడియాకు చెప్పారు.

 

రెండు వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సుష్మా చికిత్స పొందుతున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ
Telangana: తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ రోశ‌య్య స‌ల‌హాలిచ్చారు: మంత్రి వివేక్