సైదాబాద్ హత్యాచారం కేసు : చైత్ర కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి భరోసా, ఆర్థిక సాయం...

By AN TeluguFirst Published Sep 15, 2021, 3:24 PM IST
Highlights

రాష్ట్రంలో ప్రభుత్వం లేదనడానికి ఈ సంఘటన నే నిదర్శనం అన్నారు. రాష్ట్రం లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న కేసీఆర్ స్పందించడం లేదన్నారు. సింగరేణి కాలనీని సింగపూర్ చేస్తాను అని చెప్పి గంజాయికి అడ్డాగా మార్చారన్నారు. 

సింగరేణి కాలనీలో చిన్నారి కుటుంబ సభ్యులను భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని భరోసాని కల్పించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరిచి ఉరిశిక్ష వెయ్యాలన్నారు. 

సీఎస్ సోమేశ్ కుమార్ తో జరిగిన సంఘటన గురించి కోమటిరెడ్డి ఫోన్ లో మాట్లాడారు.మంత్రి సత్యవతి రాథోడ్ కి ఫోన్ చేస్తే నేను ఎందుకు రావాలి అంటుందని.. స్థానికులు కోమటిరెడ్డికి  తెలిపారు. దీంతో కోమటి రెడ్డి వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ తో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. మంత్రి ఫోన్ కి స్పందించకపోవటంతో కోమటిరెడ్డి ఆగ్రహానికి వచ్చారు. 

చిన్నారి చైత్ర హత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. సత్యవతి రాథోడ్

రాష్ట్రంలో ప్రభుత్వం లేదనడానికి ఈ సంఘటన నే నిదర్శనం అన్నారు. రాష్ట్రం లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న కేసీఆర్ స్పందించడం లేదన్నారు. సింగరేణి కాలనీని సింగపూర్ చేస్తాను అని చెప్పి గంజాయికి అడ్డాగా మార్చారన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉన్నా లేనట్టే ఉంది. త్వరలోనే రాష్ట్రపతి ని కలుస్తాం. రాష్ట్ర మంత్రులు సంఘట స్థలానికి రాకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో  అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు పరామర్శించారు. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారంచేసి  హత్య చేశాడు రాజు అనే నిందితుడు.  

ఈ ఘటన వినాయక పర్వదినం రోజే చోటు చేసుకొంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. 

 ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై  లాఠీచార్జీ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు.ఆ ఘటన జరిగిన రోజు నుండి  రాజకీయ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు

click me!