కట్లకుంట సర్పంచ్ తో కల్వకుంట వారి ఆడపడుచు

First Published Jul 18, 2018, 11:37 AM IST
Highlights

ఆడపిల్లలకు పెళ్లి తర్వాత పుట్టినప్పటి నుండి ఉన్న ఇంటిపేరు మారుతుంది. ఆమె అత్తవారి ఇంటిపేరును ఇక జీవితాంతం తన పేరు ముందు చేర్చుకుంటుంది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత మాత్రం తాను పుట్టినప్పటి నుండి ఉన్న కల్వకుంట్ల ఇంటిపేరునే పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి ఆమెకు తన పుట్టింటిపై ఎంత ప్రేముందో, ఆ ఇంటిపేరుకు ఎంతలా గౌరవిస్తుందో అర్థమయ్యే ఉంటుంది.

ఇలా కల్వకుంట వారి ఆడపడుచు కవిత తన ఇంటిపేరుతో దగ్గరి పోలికలున్న ఊరివారు కలిస్తే ఊరికే ఉంటారా? వారితో సెల్పీ దిగి సందడి చేశారు. జగిత్యాల జిల్లా జిల్లాలోని కట్లకుంట గ్రామ సర్పంచ్ చిప్పె గంగారాం తో స్వయంగా కవిత నే సెల్పీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఎంపీ స్థాయి వ్యక్తి, అందులోనూ సీఎం కూతురు స్వయంగా ఓ గ్రామ సర్పంచ్ తో సెల్పీ తీసుకోడానికి ఉత్సాహం చూపడంతో ఈ ఫోటో ప్రత్యేకతను సంతరించుకుంది.  

Selfie with Katlakunta village sarpanch Cheppe Gangaram garu. pic.twitter.com/91Vyz6TEWX

— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 17, 2018
click me!