విషాదం: కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నం

Published : Jul 02, 2019, 03:24 PM ISTUpdated : Jul 02, 2019, 03:25 PM IST
విషాదం: కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నం

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలో విషాదం చోటు చేసుకొంది. రెండేళ్ల కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలో విషాదం చోటు చేసుకొంది. రెండేళ్ల కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందింది.

 నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలంలోని పడగల్‌కు చెందిన మౌనికకకు మూడేళ్ల క్రితం నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో  వివాహం జరిగింది.  

కారణాలు ఏమిటో తెలియదు కానీ మౌనిక తన మూడేళ్ల కూతురు నిప్పంటించి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మౌనిక పరిస్థితి కూడ విషమంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...