తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1,897 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Siva Kodati |  
Published : Jun 08, 2021, 10:21 PM IST
తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1,897 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

సారాంశం

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ కోవిడ్ బారినపడి నిన్న 15 మంది మరణించారు. వీటితో కలిపి వైరస్ వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,409కి చేరింది. మహమ్మారి నుంచి నిన్న 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 182 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 91, జీహెచ్ఎంసీ 182, జగిత్యాల 46, జనగామ 24, జయశంకర్ భూపాలపల్లి 45, గద్వాల 29, కామారెడ్డి 7, కరీంనగర్ 93, ఖమ్మం 163, మహబూబ్‌నగర్ 42, ఆసిఫాబాద్ 11, మహబూబాబాద్ 70, మంచిర్యాల 63, మెదక్ 16, మేడ్చల్ మల్కాజిగిరి 101, ములుగు 41, నాగర్ కర్నూల్ 40, నల్గగొండ 153, నారాయణపేట 16, నిర్మల్ 10, నిజామాబాద్ 21, పెద్దపల్లి 87, సిరిసిల్ల 44, రంగారెడ్డి 114, సిద్దిపేట 40, సంగారెడ్డి 45, సూర్యాపేట 65, వికారాబాద్ 52, వనపర్తి 33, వరంగల్ రూరల్ 29, వరంగల్ అర్బన్ 75, యాదాద్రి భువనగిరిలో 46 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో పెరుగుతోన్న కులాంతర వివాహాలు.. ఏ కులంలో ఎక్కువగా జరుగుతున్నాయంటే.
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu