చిన్న పాపగా ఉన్న సమయంలోనే ఆమెను కిడ్నాప్ చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం దుండగులు ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి బాలికలో శృంగారపరమైన కోరికలు కలిగేందుకు ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఆ బాలికకు నరకం చూపించారు. నిందితుల్లో భార్యభర్తలు కూడా ఉన్నారు. కాగా.. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి యువతి బయటపడింది. ఈ సంఘటన ముంబయి లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్ చదువుతోంది. బాలికకు  16ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే.. కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి బాలికకు బలవంతంగా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు.

వాటివల్ల బాలికకలు సెక్స్ కోరికలు కలిగేలా చేసేవారు. అనంతరం ఆమెపై వారికి  నచ్చినప్పుడల్లా అత్యాచారానికి పాల్పడేవారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. 

చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది.