మేనల్లుడితో కలిసి కన్న కొడుకును హతమార్చిన తల్లి... ప్రియురాలిని కూడా

By Arun Kumar PFirst Published Apr 5, 2019, 2:31 PM IST
Highlights

గత నెలలో భద్రాద్రి జిల్లాలో జరిగిన ప్రేమ జంట సజీవదహనం కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మృతుల కుటుంబసభ్యులు తమవారిది ఆత్మహత్యేనని చెబుతున్నా పోలీసులు మాత్రం వీరిది హత్యేనన్న అనుమానంతో విచారణ కొనసాగించారు. చివరకు పోలీసుల అనుమానమే నిజమయ్యింది. మృతుడి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం కొత్తగూడెం డీఎస్పీ అలీ మీడియాకు వివరించారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పారిశుద్ద కార్మికురాలిగా మాచర్ల రాణి అనే మహిళ  పనిచేస్తోంది. ఆమెకు ఓ కొడుకు, కూతురు సంతానం. భర్త చనిపోవడంతో పిల్లలిద్దరికి అన్నీ తానై  ఆ తల్లి  అల్లారుముద్దుగా  పెంచింది. 

అయితే ఆమె కొడుకు సందీప్ చదువు అబ్బకపోవడంతో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యంసేవించి తల్లితో పాటు చెల్లి ప్రియాంక ను చితకబాదేవాడు. అతడి వేధింపులను తట్టుకోలేక ప్రియాంక పెదనాన్న వాళ్ల ఇంట్లో వుంటోంది. 

ఇలా జులాయిగా తిరుగుతున్న సందీప్ కు తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా ప్రేమకు ఆ తర్వాత సహజీవనానికి దారితీసింది. వీరిద్దరు కలిసి ఇరు కుటుంబాలకు దూరంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. 

వేరుగా వుంటున్నప్పటికి డబ్బుల కోసం తల్లి రాణిని వేధించడం మాత్రం ఆపలేదు. దీంతో అతడిపై ఆ  తల్లికి మమకారం తగ్గి ప్రతీకారం పెరిగింది. అతడి వేధింపుల నుండి పూర్తిగా విముక్తిపొందాలని భావించిన ఆ తల్లి కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. తన అన్న కొడుకు గోపాలకృష్ణ తో కలిసి సందీప్ ను హతమార్చడానికి పథకం వేసింది. 

ఇందులో భాగంగా వీరిద్దరు కలిసి గత నెల 17వ తేధీన అర్థరాత్రి సందీప్ అద్దెకుంటున్న ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో తేజస్వినితో కలిసి సందీప్ గాడ నిద్రలో వున్నాడు. ఇదే అదునుగా భావించిన గోపాలకృష్ణ వారిద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. తర్వాత తమకేమీ తెలియదన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కుటుంబసభ్యుల వ్యవహారశైలిపై అనుమానం రావడంతో వారిని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాలను భయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ హత్యతో సంబంధమున్న వినోద్‌ తల్లి మాచర్ల రాణి, ప్రియాంక, బావ గోపి, గోపాలకృష్ణలను చుంచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు.  

click me!