విషాదం : పిల్లలను చెరువులో తోసి, తనూ దూకి ఆత్మహత్య.. కారణమేంటంటే..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 28, 2020, 09:36 AM IST
విషాదం : పిల్లలను చెరువులో తోసి, తనూ దూకి ఆత్మహత్య.. కారణమేంటంటే..

సారాంశం

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. 

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. 

బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఏపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)కు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం అయింది. పెళ్లి తరువాత వీళ్లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు. 

ఈ మధ్య కాలంలో అత్తింటి వేధింపులు ఎక్కువ కావడం, ఆర్థిక ఇబ్బందులతో ఎల్లమ్మ మనస్తాపం చెందింది. గురువారం నాడు కూడాకుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. దీంతో బతుకు భారంగా అనిపించిం, బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హుస్నాబాద్‌కు చేరుకుంది. 

హస్నాబాద్‌ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది. ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్‌ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచ్చిందిి. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. 

చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. కొడంగల్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎస్‌ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu