ఫ్రూట్ జూస్ లో పురుగుల మందు కలిపిచ్చి... ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Aug 04, 2021, 02:44 PM IST
ఫ్రూట్ జూస్ లో పురుగుల మందు కలిపిచ్చి... ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం

సారాంశం

ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన తల్లి చనిపోగా ఇద్దరు కూతుళ్లు కొనఊపిరితో చికిత్స పొందుతున్నారు. 

ఎల్లారెడ్డి: కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపిచ్చి కన్న కూతుళ్లచేత తాగించింది ఓ తల్లి. ఆ తర్వాత ఆమె కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా ఇద్దరు కూతుర్లు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడి తండాకు చెందిన హన్సి అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. గతకొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు మరీ ఎక్కువ కావడంతో భరించలేకపోయిన ఆమె ఘోర నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు కూతుళ్లు పూజ, నందులతో ఆత్మహత్యాయత్నం చేశారు. 

read more  ప్రాణంతీసిన మద్యం మత్తు... కన్న తండ్రిని కొట్టిచంపిన కొడుకు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి హన్సి ఇద్దరు కూతుళ్లతో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించింది. ఆ తర్వాత ఆమె కూడా అదే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. చిన్నారులిద్దరు కడుపు నొప్పి భరించలేక వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు తల్లీ పిల్లలను ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తల్లి హన్సీ మృతి చెందింది. 

ఇక చిన్నారులు పూజ, నందుల పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కామారెడ్డి దవాఖాన డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?