హైదరాబాద్ లో విషాదఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు తల్లీ, కొడుకు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు చనిపోవడాన్ని తట్టుకోలేక తల్లి కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ : ఒకేరోజు Mother and son బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Businessలో నష్టం రావడంతో మొదట సందీప్ ఉరివేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేక తల్లి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి సుమారు మూడు రోజులే ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరానికి చెందిన పీ వరప్రసాద్ భార్య సరళ, కుమారుడు సందీప్ హైదరాబాదులోని కేపీహెచ్ బి ఠాణా పరిధిలోని బృందావన్ కాలనీ రిషి కళ్యాణి రెసిడెన్సీ లో నివాసం ఉంటున్నారు. సరళ గృహిణి, కాగా సందీప్ వ్యాపారి.
సోమవారం ఉదయం వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చిన కుటుంబం స్నేహితులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. కర్నూలులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాదాపూర్లో ఉంటున్న సరళ సోదరుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్రోలింగ్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సరళ(59) వంటగదిలో, సందీప్ (35) పడక గదిలో ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించలేని విధంగా మారాయి. వాటిని తరలించేందుకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. వాచ్ మెన్ కు గురువారం సాయంత్రం సందీప్ అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు ఇంటి నుంచి బయటకు రాలేదు. వరప్రసాద్ కర్నూలులో రైసుమిల్లు నడుపుతున్నారు.
undefined
ఇదిలా ఉండగద జూన్ 10న, తాను వివాహం చేసుకున్న యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుమలకు వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణ సింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకుని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకువచ్చారు.
యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పదిరోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో బాలకృష్ణ సింగ్ పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణకు గాను ఈ నెల 6న ఆయన హాజరయ్యారు. అతని మొబైల్ ఫోన్ లోని ఫోటోలను పోలీసులు డిలీట్ చేయించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటిరోజు కౌన్సెలింగ్ చేశారు.
ఈ క్రమంలో తన కుమార్తె వివాహం చేశామని, ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫోన్ కోసం దిశ పోలీస్ స్టేషన్ కు బుధవారం బయలుదేరిన బాలకృష్ణ సింగ్.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జిజిహెచ్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును బుధవారం అర్ధరాత్రి నమోదు చేశారు.