
రంగారెడ్డి : క్షణికావేశం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేయగా.. తన వల్లే భర్త అలా చేశాడంటూ ఆ భార్య ఉరి వేసుకుంది. కుమార్తె కాపురం ఇలా అయిపోయింది ఏంటన్న మనోవేదనతో ఆమె తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఇలా ఓ చిన్న క్షణికావేశం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. భార్యతో చిన్న గొడవ తలెత్తడంతో శివకుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
తనతో గొడవ పడడం వల్ల భర్త అలా చేశాడని మనస్థాపంతో.. పశ్చాతాపంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకగానొక్క కూతురు కాపురం ఇలా అయిందన్న ఆవేదనతో.. ఆమె తల్లి సంపులోకి దూకి చనిపోయింది. శాబాది ఇన్స్పెక్టర్ గురవయ్య గౌడ్ మాట్లాడుతూ.. హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేష్, యాదమ్మలకు ఇద్దరు సంతానం. మల్లేష్ కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. వీరి సంతానమైన కూతురు, కొడుకుల్లో.. కూతురు సుమిత్ర అలియాస్ శిరీషకు రెండున్నర ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెను రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్కు ఇచ్చి పెళ్లి చేశారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. అన్నం గిన్నెలు మోసిన హుజూర్‌నగర్ ఎస్సై, ఫోటోలు వైరల్
వారికి ఇంకా సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే ఆదివారం వారిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో మనస్థాపం చెందిన శివకుమార్ క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం వికారాబాద్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇలా ఉండగా తన కారణంగానే భర్త ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని సుమిత్ర తీవ్రమనస్తాపానికి గురైంది.
మంగళవారం రాత్రి హైతాబాద్ లోని తల్లి గారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బుధవారం ఉదయానికి ఆమె తల్లి యాదమ్మ (45)గమనించింది. కుమార్తె మృతి చెందడంతో.. ఆవేదనను తట్టుకోలేకపోయింది.. ఆమె జీవితం ఇలా అయిపోయింది అన్న బాధతో ఇంటి ముందు ఉన్న సంపులోకి దూకింది యాదమ్మ. అలా ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ గ్రామంలో విషాదం నెలకొంది. దీని మీద సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.