బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. అన్నం గిన్నెలు మోసిన హుజూర్‌నగర్ ఎస్సై, ఫోటోలు వైరల్

Siva Kodati |  
Published : Mar 29, 2023, 09:47 PM IST
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. అన్నం గిన్నెలు మోసిన హుజూర్‌నగర్ ఎస్సై, ఫోటోలు వైరల్

సారాంశం

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై అన్నం గిన్నెలను మోయం కలకలం రేపిగింది

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై అన్నం గిన్నెలను మోయం కలకలం రేపిగింది. దీనిపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... హుజూర్‌నగర్‌లోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరి కోసం నిర్వాహకులు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే ఎస్సై కట్టా వెంకట రెడ్డి ఓవరాక్షన్ చేశారు. వంటలు చేసిన ప్రాంతం నుంచి డైనింగ్ ఏరియాకు అన్నం గిన్నెలను బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మోశారు. చుట్టూ వందలాది మంది నేతలు, కార్యకర్తలు వున్నప్పటికీ ఎస్సై కట్టా వెంకటరెడ్డి స్వయంగా అన్నం గిన్నెలు మోయడం కలకలం రేపింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?