పాపం! థర్మకోల్ బంతులను తింటున్న కోతులు

First Published Jul 9, 2018, 10:55 AM IST
Highlights

అడవులు తరగిపోవడం, పండ్ల చెట్లు లేకపోవడంతో జనావాసాలకు తరలి వచ్చిన కోతులు ఆహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో చెప్పరాదు. వాటి  బెడద గురించి అందరం బాధ పడుతాం గానీ వాటి మానాన అవి బతకడానికి మనం చేస్తున్నదేమీటో ఆలోచించం.

అడవులు తరగిపోవడం, పండ్ల చెట్లు లేకపోవడంతో జనావాసాలకు తరలి వచ్చిన కోతులు ఆహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో చెప్పరాదు. వాటి  బెడద గురించి అందరం బాధ పడుతాం గానీ వాటి మానాన అవి బతకడానికి మనం చేస్తున్నదేమీటో ఆలోచించం. ఆఖరికి అవి తెలిసీ తెలియక థర్మకోల్ బంతులను కూడా తింటున్నాయంటే పరిస్థితి ఎంతటి స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 

సరిగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న హరితహారం కార్యాచరణ ప్రణాళిక గురించి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఈ కోతి మెదక్ లోని సాయి బాలాజీ ఫంక్షన్ హలో సమీక్ష సమయంలో థర్మోకోల్ బంతులను తినసాగింది. దాని బాటలో మరి కొన్ని కోతులు తర్వాత వచ్చి చేరాయి.

 

                              

కాగా, తెలంగాణలో మొత్తం అటవీ శాతం పన్నెండు శాతమే ఉందని, దాన్ని పెంచడానికి ప్రభుత్వం, ప్రజలూ కలిసికట్టుగా కృషిచేయాలని ముఖ్యమంత్రి ఈ సమీక్షలో విజ్ఞప్తి  చేశారు. ఏడాది వంద కోట్ల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కోతులు జనావాసాలకు రావడాన్ని కూడా అయన ప్రస్తావించడం విశేషం. 

 

                              

కాగా, గతంలో 'అభివృద్ధికి పుట్టిన కోతి' అన్న కథనాన్ని అందించి. అసెంబ్లీ సాక్షిగా  ముఖ్యమంత్రితో అభినందనలు అందుకున్న కందుకూరి రమేష్ బాబు ఈ ఫోటోలు తీశారు. అభివృద్ధి ఫలాలు ఎంత చేదో చెప్పడానికి. మనవలె కోతులూ తమ సహజ స్వభావాన్ని తాము కోల్పోతున్నవి అని చెప్పడానికి!

 

click me!